Hero Karthi Gave Clarity On Khaidi 2 | కార్తీ హీరోగా విడుదల సంచలనాలు సృష్టించిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమాతో లోకేష్ కనగరాజన్‌ను తెలుగు తమ్ముళ్లు నెత్తిన పెట్టుకున్నారు. ఈ సినిమా చూసి రెండో భాగం ఉండాలని, దాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకున్నాడు. అయితే వారికి అదిరిపోయేలా.. ఇది భాగాలు కాదు సెపరేట్ యూనివర్స్ అని ప్రకటించి మరింత ఉత్సాహాన్ని అందించారు మూవీ టీమ్. అప్పుడు మొదలు ఇప్పటి వరకు ఖైదీ 2పై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. అసలు ఖైదీ 2 సినిమా చేస్తారా చేయరా అన్న విషయాన్ని కూడా చెప్పలేదు. ఖైదీ అనే సినిమా ఒకటి తీసినట్లైన లోకేష్‌కు గుర్తిందా అని అడిగిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే ఖైదీ 2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు తాజాగా తెరదించింది మూవీ టీమ్. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తప్పకుండా ఖైదీ 2 ఉంటుందని, వస్తుందని తేల్చి చెప్పాడు మన ‘ఢిల్లీ’ అదే హీరో కార్తి. అంతేకాకుండా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో కూడా చెప్పేశాడు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే 2025 సమ్మర్ నుంచి ఖైదీ 2 షూటింగ్ షురూ అవుతుందని మూవీ వెల్లడించింది. తన నెక్స్ట్ సినిమా కూడా ఖైదీ 2నే కానుందని, ఈ సీక్వెల్‌లో ఖైదీని మించిన యాక్షన్, ఎమోషన్స్, ట్విస్ట్‌లు ఉంటాయని చెప్పాడు కార్తి. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలు ఇప్పుడు తారామండలాన్ని దాటి పోతున్నాయి. ఈ క్రమంలో Khaidi 2 సినిమాతో విక్రమ్‌ను కూడా జోడించనున్నారని టాక్ వినిపిసతోంది. కానీ రెండు కథలను అసలు లోకేష్ ఎలా మెర్జ్ చేస్తాడన్నదానిపై ప్రస్తుతం భారీగా చర్చ జరుగుతోంది.