‘మాస్టర్‌ మైండ్ మధుబాబే’.. కిడ్నీ ముఠా కేసులో కీలక ట్విస్ట్

-

విజయవాడ కిడ్నీ రాకెట్(Vijayawada Kidney Racket) వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇందులో అసలు మాస్టర్‌ మైండ్ మధుబాబే అంటూ మధ్యవర్తి వెంకట్ ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా ఏమైనా అనుమానాలు ఉంటే విచారణ చేసుకోవాలని కూడా వెల్లడించాడు. తనపై అంతా తప్పుడు ప్రచారం జరుగుతోందని, తనకేం తెలియదంటూ వాపోయాడు వెంకట్. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కిడ్నీ పొందిన వ్యక్తితో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. అసలు కిడ్నీ రాకెట్‌ ఎటు పోతుందని ప్రజలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.

- Advertisement -

Vijayawada Kidney Racket | ‘‘కిడ్నీ మార్పిడి కేసులో నేను సూత్రధారి అని నేనే అంతా ప్లాన్ చేశానని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో నాకు ఏమీ తెలీదు. అంతా చేస్తున్నది మధుబాబే. అసలు నేరస్థుడు కూడా అతడే. ఈ తతంగం మొత్తాన్ని వెనకుండి నడిపిస్తున్న మాస్టర్‌మైండ్ అతడే. నేను ఏ తప్పూ చేయలేదు. కావాలంటే సమగ్ర విచారణ చేయండి. నేను ఎలాంటి కిడ్నీ దందాలు చేయలేదు. చేయట్లేదు కూడా. సహాయం అడిగితే సహాయం చేశాను. అది తప్పా. చివరి వరకు కూడా సహాయం చేస్తున్నానే అనుకున్నాను తప్ప.. దందా అనుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు వెంకట్. అయితే ఇప్పటికే ఈ కేసులో మోసపూరితంగా కిడ్నీ మార్పిడి చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: ఖైదీ 2 ఉన్నట్టా లేనట్టా.. క్లారిటీ ఇచ్చిన టీమ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...