విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసి ప్రకటన తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. అంతేకాకుండా ఆయన ప్రకటనతో లక్షల మంది మనసు కుదుట పడిందని కూడా అభిప్రాయపడ్డారు. కొన్ని రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉంది. కేంద్రం మంత్రి విశాఖలో చేసిన పర్యటన కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగానే ప్రచారం జరిగింది. దీంతో విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు, ఆంధ్రుళ్లో ఆందోళన, ఆగ్రహం అధికమైపోయాయి.
ఇంత పోరాటం చేస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని అనేక మంది మేధావులు ప్రశ్నించారు కూడా. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కుమారస్వామి(Kumaraswamy) మాత్రం.. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ జరగదని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును అభివృద్ధి చేయాలని, కర్మాగారాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనే కేంద్రం చూస్తోందని చెప్పారు. ఆయన క్లారిటీ ఇవ్వడంతో విశాఖ ఉక్కు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. దీనిపైనే తాజాగా లోకేష్ స్పందించారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి తన ప్రకటనతో ఆంధ్రుల మనోభావాలను నిలబెట్టారని చెప్పుకొచ్చారు లోకేష్. ఇన్నాళ్లూ తమ ఆంధ్రప్రదేశ్‌లోని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై నీలి మీడియా చేసిన అసత్య ఆరోపణలను సైతం ఆయన ప్రకటన పటాపంచలు చేసేసిందని చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల అంచనాలను అందుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆ దిశగానే తమ పాలన ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎటువంటి పనులు చేయదని చెప్పారు లోకేష్(Nara Lokesh).
I thank the Hon'ble Union Minister of Steel & Heavy Industries, Shri @hd_kumaraswamy avaru for upholding the sentiments of Andhra Pradesh and safeguarding the VSP.
The statement by the Hon'ble Minister, categorically stating that privatization is not on the table, has brought… pic.twitter.com/uMZJexh2fz
— Lokesh Nara (@naralokesh) July 11, 2024