రఫ్ఫాడిస్తున్న ‘రాయన్’ ట్రైలర్

-

Dhanush Raayan | తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా తానే ఓ సినిమాను కూడా స్వయంగా తెరకెక్కిస్తున్నారు. తానే హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మూవీ టీమ్ ‘రాయన్’ అని పేరుపెట్టింది. సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు కొండంత అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ మూవీ జూలై 26 ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ట్రైలర్‌కు మరింత హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -

విడుదలైన ఈ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్ ప్యాక్‌డ్‌గా ఉన్న ఈ ట్రైలర్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలరే రఫ్ఫాడిస్తోందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ ఊహాగానాలు కూడా ప్రారంభించేశారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఫుల్లెస్ట్ ఇచ్చారని ట్రైలర్ చూసిన వారంటున్నారు. ఈ ట్రైలర్.. మూవీపై ఉన్న అంచనాలను మరింత అధికం చేసేసింది. మరి అభిమానుల అంచనాలను అధిగమించే రిజల్ట్స్‌ను ‘రాయన్(Raayan)’ రాబడుతుందో లేదో తెలియాలంటే జూలై 26 వరకు వేచి చూడాల్సిందే.

Read Also: స్టార్ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ రీలే కారణం..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...