మాజీ క్రికెటర్ దారు హత్య!

-

Dhammika Niroshana | మాజీ క్రికెటర్‌ను భార్య, పిల్లల కళ్లెదుటే హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు.. మాజీ క్రికెటర్ ఇంట్లోకి చొరబడి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శ్రీలంక అండర్ 19 జట్టుకు 2000 సంవత్సరంలో సారథిగా వ్యవహరించిన నిరోషన(41) హత్య ఘటన ప్రస్తుతం శ్రీలంక అంతటా చర్చనీయాంశంగా మారింది. అతని కుటుంబానికి న్యాయం చేయాలని అనేక మంది కోరుతున్నారు. అయితే నిరోషన నివాసంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడి ఉన్న నిరోషనను పోస్ట్‌మార్టం నిమిత్తుం ఆసుపత్రికి తరలించామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. అతడి వివరాలు కూడా ఏమీ తెలియలేదని, అసలు నిరోషనపై దాడి ఎందుకు జరిగిందో కూడా తెలియలేదని, ఆ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పోలీసులు వివరించారు. వీలైనంత త్వరగా నిరోషన హంతకుడిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ 19 జట్టుకు సారథ్యం వహించిన నిరోషన ఆ తర్వాత వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 20ఏళ్లకే క్రికెట్ దూరమయ్యాడు. అప్పటి నుంచి అతడు శ్రీలకంలోని గాలె జిల్లాలో అంబాలన్‌గోడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అతడు హత్యకు గురికావడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శ్రీలంక టీమ్ ప్లేయర్లు కూడా నిరోషన( Dhammika Niroshana) మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.

Read Also: ‘నన్ను క్షమించండి’.. ఫ్యాన్స్‌కు నవీన్ పోలిశెట్టి మెసేజ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...