Virat Kohli – Gautam Gambhir | టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక కావడయం అయితో మరొకటి టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ ఎన్నికవడం. అయితే వీటన్నింటినీ మైమరింపించేలా కొత్త భయం ఒకటి టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అదే గంభీర్, కోహ్లీ మధ్య వైరం. వీరిద్దరు తొలుత చాలా స్నేహపూర్వకంగానే ఉన్నా ప్రస్తుతం మాత్రం వీరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో ఈ నెలాఖరున టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అందులో మూడు టీ20, మూడు వన్డేలు ఆడనున్నాయి ఇరు జట్లు. వీటిలో వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ కూడా ఆడనున్నాడు. దీంతో వన్డే మ్యాచ్‌ల సమయంలో గంభీర్, కోహ్లీ మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది. వీరి మధ్య గొడవలను నియంత్రించడానికి బీసీసీఐ ఏమైనా మాస్టర్ ప్లాన్ వేస్తుందా? అన్న చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతూ వస్తోంది.
ఈ సందర్భంగానే గంభీర్‌తో తనకున్న వివాదాల విషయంలో కింగ్ కోహ్లీ(Virat Kohli).. బీసీసీఐకు ఓ హామీ ఇచ్చాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. గంభీర్‌తో తాను గొడవ పడతాననే భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చాడట. గతంలో గంభీర్‌తో జరిగిన గొడవలను మర్చిపోయానని, తాను ఇప్పుడు పాత కోహ్లీని కాదని వివరణ ఇచ్చాడట. జట్టు ప్రయోజనాల కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని, అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి శాయశక్తులా శ్రమిస్తానని చెప్పాడట. దీంతో బీసీసీఐ(BCCI) పెద్దల మనసు కుదుట పడిందని సదరు అధికారి వివరించారు. కానీ అసలు వీరిద్దరి మధ్య సఖ్యత సాధ్యమేనా అంటే దానికి శ్రీలంకతో సిరీసే సమాధానం చెప్తుంది.