Union Budget |కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లోని కీలక కేటాయింపులు ఇవే..
ప్రజల మద్దతుతో మూడోసారి అధికారంలోకి
– ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం
– దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
– అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
– మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్
9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్
– ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై దృష్టి
– వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
– వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
నిరుద్యోగుల కోసం మూడు పథకాలు
– ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
– ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
– సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు – గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
– 210 లక్షల మంది యువతకు లబ్ధి
అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయం
– ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
– అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు
– పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి
– రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
– విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
విద్యార్థులకు రూ.10లక్షల రుణం
– దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు
బిహార్‌కు ఆర్థిక సాయం
– బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం
– బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20వేల కోట్లు
గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు
– బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
– ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
కోటి మందికి ఉద్యోగ కల్పన
– 500 పెద్ద కంపెనీల్లో కోటికి మంది యువతకు ఉద్యోగాల కల్పన
– వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
– 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు
– పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
– పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు
– గృహ నిర్మాణంపై బడ్జెట్లో ప్రకటన
– అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు
మౌలిక సదుపాయాలకు ₹11.11 లక్షల కోట్లు
– మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్లో మరోసారి పెద్దపీట
– బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
– జీడీపీలో 3.4 శాతానికి సమానం
స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
– స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
– మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
వరద నివారణకు బిహార్‌కు రూ.11వేల కోట్లు
– వరదల వల్ల బిహార్ ఏటా నష్టపోతోంది
– వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11వేల కోట్లు కేటాయింపు
– వరద నివారణకు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు
ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట
– కాశీ తరహాలో గయ అభివృద్ధి
– బిహార్ రాజ్గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
– టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి
NPSలో మార్పులు
– ఎన్పీఎస్ పథకంలో మార్పులు
– మైనర్లూ చేరేందుకు అవకాశం
ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం
– ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గుతుందని అంచనా
– మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు
– విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం
క్యాన్సర్ రోగులకు ఊరట
– క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
– మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
– బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
– ప్లాటినమ్పై 6.4 శాతానికి కుదింపు
మొబైల్ ఫోన్లపై సుంకం తగ్గింపు..
– మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ
– లాంగ్ టర్మ్ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
– క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు
– స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు
Union Budget | కొత్త పన్ను విధానంలో మార్పులు
– సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
– రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
– రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
– రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
– రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
– రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
– కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
– స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు