సాత్విక్-చిరాగ్ ఓటమి.. తాప్సీ భర్త సంచలన నిర్ణయం

-

Olympic | ప్రస్తుతం ప్రపంచమంతా ప్యారిస్ ఒలింపిక్స్‌ వైపే చూస్తోంది. అందులోనూ అందరూ ఈసారి భారత్ ఏ స్థాయిలో రాణిస్తుందనేది గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్న సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట భారత్ తప్పకుండా పతకాన్ని తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వారు నిరాశపరిచి ఇంటి బాటపట్టారు. ఈ క్రమంలో వారి కోచ్, నటి తాప్సీ భర్త మథియాస్ బో(Mathias Boe) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరిత పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు మాథియస్.

- Advertisement -

Olympic | ‘‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇక భారత్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా కోచింగ్ బాధ్యతలు చేపట్టను. నా జీవితంలో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లోనే గడిపాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో కూడుకున్నదే, అలసిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ పోస్ట్ పెట్టాడు.

Read Also: కల్కి సినిమాలో ‘యాస్కిన్’ పాత్రకు సెకండ్ ఆప్షన్ అతడే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...