Maharashtra | సెల్ఫీ సరదా యువతి ప్రాణాల మీదకి తెచ్చింది. సెల్ఫీ తీసుకుంటుండగా లోయలో పడిపోయింది. ఓ యువతి కొందరు స్నేహితులతో కలిసి మహారాష్ట్ర సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు వెళ్ళింది. స్నేహితులు అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధిత యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న సేఫ్టీ బృందం ఆమెను రక్షించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు. ఆమె క్షేమంగా ఉన్నప్పటికీ లోయలో పడటంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.