Collectors Conference | ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణం అజెండాగా సాగిన కలెక్టర్ల సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలో భాగంగా అధికారులకు సీఎస్ నీరభ్ కుమార్ కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తే రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ివరించారు. ప్రభుత్వ ప్రతిష్టను పటిష్టం చేయాల్సింది కలెక్టర్లేనని వివరించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు ఆయన వంద రోజుల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Collectors Conference | రానున్న వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రబుత్వం పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేసిందని, దానిని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని వెల్లడించారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒకవేళ ప్రజల సమస్య ఏదైనా మీస్థాయికి మించి ఉంటే వాటిని వెంటనే ఆయా విభాగాల ఉన్నతాధికారులకు బదిలీ చేయాలని సూచించారు.