కాంగ్రెస్ సర్కార్‌‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ కామెంట్స్

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఎవరూ ఆనందంగా లేరని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని అన్నారు. పాడి రైతులకు నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. పాడి రైతులకు నాలుగు నెలల బకాయిలు పక్షం రోజుల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

బకాయిలు చెల్లించకపోతే పాడి రైతులతో కలిసి ఉద్యమానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లో వాడే 30 లక్షల లీటర్ల పాలలో తెలంగాణ వాటా 5 లక్షల లీటర్లు అని అన్నారు. రాష్ట్ర పాడి రైతుల నుంచి సేకరించే రూ.5 లక్షల లీటర్లలోనూ కోతకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. విజయ డెయిరీలో రూ.500 కోట్ల మేర పాడి ఉత్పత్తులు ఉన్నాయని Srinivas Goud అన్నారు.

Read Also: తెలుగు నటికి అరుదైన గౌరవం..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Indian Navy | భారత సబ్‌మెరైన్‌కు ప్రమాదం.. 13 మంది ఉన్న పడవ..

గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో భారత నేవీకి(Indian Navy)...

Vinod Tawde | ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు.. ఎందుకంటే..

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేత వినోద్ తావ్‌డే...