Calcium Food | ఎముక బలానికి, పెరుగుదలకు, రక్తం గడ్డ కట్టడానికి, కండరాల కదలికకి కాల్షియం చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ మనలో ఎముక బలం, కండరాల బలం కూడా తగ్గిపోతుంది. అందుకే డాక్టర్లు ప్రత్యేకంగా కాల్షియం టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కాల్షియం మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభిస్తుంది. పాలు, సోయా మిల్క్, పెరుగు, హార్డ్ చీజ్, బలవర్థకమైన తృణధాన్యాలు, అన్‌ఫోర్టిఫైడ్ బాదం పాలు వంటి వాటిలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. అందుకే వీటిని తరచూ మనం తినే ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రోజుకి ఎంత Calcium Food అవసరం:
19-50 సంవత్సరాల వయస్సు గల వారికి: రోజుకు 1,000 మిల్లీగ్రాములు
51, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు: రోజుకు 1,200 మిల్లీగ్రాములు
51-70 సంవత్సరాల వయస్సు గల పురుషులు: రోజుకు 1,000 మిల్లీగ్రాములు
71 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు: రోజుకు 1,200 మిల్లీగ్రాములు