సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు సీఐఐ(CII) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇందులో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఆయనతో చంద్రబాబు పలు కీలక విషయాల గురించి చర్చించారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిదుల బృందంలో చేసిన చర్చలు ఫలదాయంగా ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఈ సమావేశంలో రాష్ట్రాన్నికి కొత్త పెడ్డుబులను తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. అంతే కాకుండా అమరావతి(Amaravati)ని ఇండస్ట్రియల్ హబ్ తరహాలో తీర్చి దిద్దడంపై కూడా ఆయన చర్చించారని సమాచారం. అమరావతి చుట్టూ వివిధ పరిశ్రమలు తీసుకురావాలని, వీటి ద్వారా సంపద, ఉపాధి అవకాశాల సృష్టి చేయాలన్న విజన్‌తో చంద్రబాబు(Chandrababu) అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.