సెజ్ ఫార్మా ప్రమాద బాధితులకు అక్కడే చికిత్స

-

Atchutapuram Sez | అచ్యుతాపురం ఫార్మా సేజ్ సంస్థలో జరిగిన ప్రమాద క్షతగాత్రులకు అధికారులు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో, 10 మందికి అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో, ఏడుగురుకి విశాఖపట్నంలోని మెడికవర్‌లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి, వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Atchutapuram Sez లో మరణించిన వారు వీరే..

  1. నీలాపు రామిరెడ్డి, ఏజీఎం, వెంకుజీపాలెం
  2. ప్రశాంత హంస, సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం
  3. నారాయణరావు మహంతి, అసిస్టెంట్ మేనేజర్, గరివిడి, విజయనగరం
  4. గణేష్ కుమార్ కొరపాటి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బిక్కవోలు, తూర్పుగోదావరి
  5. హారిక చెల్లపల్లి, ట్రైనీ ఇంజినీర్, కాకినాడ
  6. రాజశేఖర్ పైడి, ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్, ఆమదాలవలస, శ్రీకాకుళం
  7. సతీష్ మారిశెట్టి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మామిడికుదురు, కోనసీమ
  8. నాగబాబు మొండి, అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట
  9. బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు, అసిస్టెంట్ మేనేజర్, కూర్మన్నపాలెం, విశాఖపట్నం
  10. వేగి సన్యాసినాయుడు, హౌస్ కీపింగ్ బాయ్, రాంబిల్లి మండలం
  11. చిన్నారావు ఎలబల్లి, పేయింటర్, దిబ్బపాలెం
  12. పార్థసారథి, ఫిట్టర్, పార్వతీపురం మన్యం
  13. మోహన్ దుర్గాప్రసాద్ పూడి, హౌస్ కీపింగ్ బాయ్, దిబ్బపాలెం
  14. ఆనందరావు బమ్మిడి, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, గొల్లపేట, విజయనగరం
  15. సురేంద్ర మర్ని, ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, ఉట్లపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం
  16. పూసర్ల వెంకటసాయి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, బంగారమ్మపాలెం, అనకాపల్లి జిల్లా
  17. జవ్వాది చిరంజీవి, ఇంజినీరింగ్ విభాగం, దార్లపూడి, అనకాపల్లి జిల్లా
Read Also: ఎసెన్షియాపై కేసు నమోదు.. వెల్లడించిన మంత్రి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...