అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. వారికి ప్రతి అడుగులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగానే ఈరోజు ఎసెన్షియా ప్రమాద మృతుల్లో ఒకరి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెక్కును విజయచంద్ర(MLA Vijayachandra) అందించారు.
అచ్యుతాపురం ప్రమాద మృతుల్లో చలంవలస గ్రామానికి చెందిన పార్థసారథి కూడా ఒకరు. ఈరోజు ఆయన కుటుంబీకులను ఎమ్మెల్యే విజయచంద్ర(MLA Vijayachandra) పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వారికి పరిహార చెక్కును అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబానకి పరిహారం అందించామని, అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, యాజమాన్యాల నిర్లక్ష్యానికి అమాయకులైన కార్మికులు బలి కాకుండా చర్యలు చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు.