అనుప‌మ పెట్టే కండిషన్ కు షాకవుతున్న దర్శక నిర్మాతలు

అనుప‌మ పెట్టే కండిషన్ కు షాకవుతున్న దర్శక నిర్మాతలు

0
98

ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది అనుప‌మ …సింపుల్ అండ్ లుక్ ట్రెడిష‌న‌ల్ ల‌వ్లీగా ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.. ఈ సినిమా తర్వాత అ ఆలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలు తక్కువగానే చేసింది టాలీవుడ్ లో, కాని ఆమె అందం అభినయానికి ఫ్యాన్స్ కూడా అలాగే వచ్చారు, ఇక తాజాగా ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడు సినిమాలో నటించింది. అందులో టీచర్ గా బాగా నటించింది.

అయితే ఆమె గ్లామర్ రోల్స్ కి చాలా దూరంగానే ఉంటోంది. అలాంటి చిత్రాలు చేయడం లేదు. పొట్టి బట్టలు ఎక్స్ పోజింగ్ కు ఆమె దూరం. ఇక తనకు గ్లామర్ రోల్స్ సూట్ కావు అని చెబుతోంది, తనకు పొట్టి బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతోంది. తను సహజంగా ఉంటాను అని సినిమాలోనే మేకప్ వేసుకుంటాను అని చెప్పింది. అందుకే తనకు అవకాశాలు రావట్లేదు అని చెపుతోంది. తనకు అవకాశాలు చాలా వస్తున్నాయి కాని గ్లామర్ రోల్స్ మాత్రం నేను చేయను అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ