Jammu Kashmir Elections | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల యాక్షన్ ప్లాన్ పై చర్చలు జరిపారు. 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉన్న బిజెపి… అభ్యర్థుల ఎంపిక పైనా కసరత్తు చేసింది. 50 మంది అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం.
Jammu Kashmir Elections | ఇక ఈరోజే (సోమవారం) ఎంపిక చేసిన క్యాండిడేట్స్ ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 అక్టోబర్ 1వ తేదీలలో మూడు విడతల్లో జమ్మూలో ఎన్నికలు జరగనున్నాయి. అగ్ర నాయకులతో కాశ్మీర్లో ఎనిమిది ర్యాలీలు నిర్వహించాలని నిన్నటి సమావేశంలో బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ఈనెల 29న మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.