పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat).. అనర్హత వేటుతో వెనుతిరిగారు. ఫైనల్‌కి ముందు బరువు పెరగడంతో వినేష్‌పై అనర్హత వేటు పడింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో కూడా వినేష్‌కు చుక్కెదురైంది. తీవ్ర మనోవేదనతో భారత్‌కు చేరుకున్న వినేష్.. ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఆమెను బంతారు పతక విజేతగా పరిగణిస్తామంటూ ఆమె సొంత గ్రామం బలాలి గ్రామ పెద్దలు వెల్లడించారు. అయితే ఒలింపిక్స్‌లో అనర్హత వేటుతో వెనుతిరిగిన సమయంలో క్షణాకివేశమో, మనోవేదనతోనే వినేష్.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించేసింది. తాజాగా ఆమె విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వినేష్ తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకునేలా చేస్తామని మహవీర్ ఫోగట్ వెల్లడించారు. ఈ సందర్భంగానే వినేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధాన్యం సంతరించుకున్నాయి. బలాలి పెద్దలు నిర్వహించిన సత్కార సభలో వినేష్ మాట్లాడుతూ.. తన పోరాటం ఇప్పుడే మొదలైందని అన్నారు.
‘‘నా పోరాటం ముగియలేదు. భారత అమ్మాయిల కోసం చేసే నా పోరాటం ఇప్పుడే మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో ఆడలేకపోయాను. అందుకు చాలా బాధపడ్డా. భూమిపై నా అంత దురదృష్ట వంతులు ఎవరూ ఉండని అనుకున్నా. కానీ భారత్‌లో నాకు లభించిన మద్దతు చూసిన మరుక్షణం నా మనోవేదన కనుమరుగైంది. నేను చాలా అదృష్టవంతురాలినని అనిపించింది. నాకు వీరిచ్చిన మెడల్ కన్నా గొప్ప గౌరవం ఇంకేమీ ఉండదు. వీరు చూపుతున్న అభిమానం ముందు ఏదైనా దిగదుడుపే’’ అని వినేష్(Vinesh Phogat) వ్యాఖ్యానించింది. దీంతో వినేష్ తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకోనుందా అన్న చర్యలు జోరుగా జరుగుతున్నాయి. మరి ఈ విషయంపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.