పరవాడ ఫార్మా సిటీలోని సినర్జీ సంస్థ ప్రమాద మృతుల సంఖ్య మూగ్గుకురికి చేరింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రుడైన నాలుగో వ్యక్తికి కూడా పరిహారం అందిస్తామని, ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని కూడా వెల్లడించారు. అంతేకాకుండా అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నామని కూడా తెలిపారు. అచ్యుతాపురం, పరవాడ ప్రమాద బాధితులను కూటమి ప్రభుత్వమే ఆదుకుందని అన్నారు.
కానీ బాధితుల కుటుంబాలకు అడ్డుకుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రమాదాలు జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు(Chandrababu) స్పందించి బాధితులకు భరోసా కల్పించారని, కానీ ఇవేమీ పట్టకుండా వైసీపీ నేతలు కూటమి పాలనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితు కుటుంబాలకు చెప్పినట్లే పరిహారం కూడా చెల్లించేస్తున్నామని చెప్పారు. వైసీపీ చెప్పుకున్నట్లే జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. రూ.కోటి పరిహారం ప్రకటించిన తొలి ప్రభుత్వమే కాకుండా చెప్పిన పరిహారాన్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం కూడా వారిదేనంటూ ఎద్దేవా ఆమె(Vangalapudi Anitha) చేశారు.