పాకిస్థాన్ క్రికెట్ టీమ్ బౌలర్లపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) ఒకరేంజ్‌లో విరుచుకుపడ్డాడు. మా బౌలర్లకు అంత సినిమా లేదంటూ విమర్శలు గుప్పించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 446/6 దగ్గర డిక్లేర్ చేసింది. ఆ తర్వాత పాక్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసి అందరి కళ్లూ బైర్లు కమ్మాయి. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అన్న డౌట్ టీమ్ పాక్ మాజీలకే కలిగిందంటే.. ఇక ప్రేక్షకుల పరిస్థితి ఏంటో. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే పాక్ టీమ్ పటాపంచలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ టీమ్ ఆటతీరు చూసిన మాజీ కెప్టెన్ లతీఫ్.. ఒక రేంజ్‌లో విమర్శలు, సెటైర్లే వేశారు. ఇప్పుడున్న బౌలర్లు.. మునపటిలా ఎందుకు బౌలింగ్ చేయట్లేదో అర్థం కావట్లేదన్నారు.
‘‘మా ఫాస్ట్‌బౌలర్లు షార్ట్ ఫార్మాట్లలో మాత్రమే ఔరా అనిపిస్తారు. టెస్టుల్లాంటి ఫార్మాట్‌లకు వస్తే ఏమిరా? అనేలా చేస్తారు. టెస్ట్‌లో 30 ఓవర్ల బౌలింగ్ కూడా వాళ్లు చేయలేరు. ఇలాంటి బౌలింగ్, బౌలర్లతో సుదీర్ఘ ఫార్మాట్‌లలో రాణించడం కుదరదు. జోఫ్రా ఆర్చర్‌ను చూడండి.. రెండేళ్ల రెస్ట్ తర్వాత వచ్చాడు. కానీ అతడి బౌలింగ్ వేగంలో రవ్వంత కూడా మార్పులేదు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా అంతే.. సర్జరీ చేయించుకుని వచ్చినా తన ఫామ్‌ను ఏమాత్రం కోల్పోకుండా అదరగొడుతున్నాడు. మరి మా బౌలర్లు ఎందుకు నెమ్మదిస్తున్నారో మాత్రం మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో లాంగ్ ఫార్మాట్లలో ఆడే సినిమా పాక్ టీమ్ లో ఒక్క బౌలర్‌కి కూడా లేదు’’ అంటూ తన(Rashid Latif) అభిప్రాయం వ్యక్తం చేశాడు.