మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మారింది పాకిస్థాన్(Pakistan) క్రికెట్ టీమ్ పరిస్థితి. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి సొంత దేశం వారిచే ఛీ అనిపించుకుంటున్న బాధలో ఉన్న పాక్ టీమ్‌కు ఐసీసీ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ పాయింట్ల కోతతో పాటు పాక్ ప్లేయర్స్‌పై జరిమానా కూడా వేసింది ఐసీసీ(ICC). పాక్ టీమ్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్లలో ఆరు పాయింట్లను కోతవేసింది ఐసీసీ. దాంతో పాటుగా పాక్, బంగ్లాదేశ్ టీమ్‌లకు జరిమానా కూడా విధించింది.
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో స్లోఓవర్ రేట్ నమోదైంది. ఆ కారణంగానే ఇరు జట్లకు జరిమానా విధించింది. జట్టు డిబ్ల్యూటీ పాయింట్లలో కూడా కోతవేసింది. జరిమానాలో భాగంగా పాక్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 30శాతాన్ని కోత వేసిన బంగ్లాదేశ్(Bangladesh) టీమ్ ప్లేయర్లకు 15శాతం కోత విధించింది ఐసీసీ(ICC). దీంతో పాటుగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ ఫకీబ్ ఉల్‌హసన్‌కు అదనంగా మరో 10శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది. సెకండ్ ఇన్నింగ్స్ 33వ ఓవర్లో పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ వైపు కోపంగా బంతి విసిరనందుకే షకీబ్‌కు ఈ అదనపు జరిమానా విధించింది.