Heavy Flood | ఆంధ్రప్రదేశ్‌ను రెండు రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అనేక విపత్తులు సంభవించాయి. ఈ వరదల కారణంగా పలు జిల్లాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కదిక్కడ నిలిచిపోయింది. ఈ వరదల ఉధృతి తగ్గే పరిస్థితులు కనిపించకపోవడం ప్రజలకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అందులో విజయవాడలోని పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు తొలి అంతస్తు వరకు వచ్చేశాయి. దీంతో విజయవాడ వాసులు దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటున్నారు. దాదాపు 290 వరకు లంక గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి. ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. భారీ మొత్తంలో పశు నష్టం కూడా జరిగిందని అధికారులు వెల్లడించారు.
Heavy Flood | మృతుల్లో ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. విజయవాడ గ్రామాల్లో ఒకరు, జీకొండూరు మండలంలో ఒకరు, రెడ్డి గూడెం మండలంలో మరొకరు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో కూడా ఐదుగురు వరదలకు ప్రాణాలు విడిచారు. పెదకాకాణిలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్.. వరదలకు కొట్టుకుపోయారు. మంగళగిరిలో బోల్డర్ పడి ఓ మహిళ ప్రాణాలు విడిచారు. పొన్నెకల్లులో మరొకరు కూడా పొంగిపోర్లుతున్న వాగులో కొట్టుకుపోయారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్‌లో ఈతకని వెళ్లిన ముగ్గురు చిన్నారులు వరద నీటిలో మునిగి మరణించారు.