Kolkata Rape Case | కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన దేశమంతా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం నిందితులతో చేతులు కలిపేశారని, ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి కట్టుగా తప్పు చేసిన వారికి రక్షించడానికి చూస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది తొలి రోజు నుంచే జరుగుతుందని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ముందునుంచే తమ కూతురు కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమకు పోలీసులు, అధికారులు ఏ ఒక్కరూ కనీస సహకారం కూడా అందించడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న సందర్భంగా వారు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, కేసును తప్పుదారి పట్టించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Kolkata Rape Case | ‘‘ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఈ ప్రభుత్వం, పాలన యంత్రాంగం, పోలీసులు ఏ ఒక్కరు కూడా మాకు సహకరించడం లేదు. సాక్ష్యాలను చెరిపేయడానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నారు. ఇలానే కొనసాగితే మాకు న్యాయం ఇప్పుడప్పడే కాదు అసలు దక్కుతుందన్న ఆశ కూడా లేదు. కానీ న్యాయం కోసం మాత్రం పోరాడుతూనే ఉంటాం. ఈ దేశ ప్రజలంతా మాకు అండగా ఉంటారని విశ్వసిస్తున్నా. అదే భరోసాతో పోరాటాన్ని కొనసాగించనున్నాం’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే కోల్‌కతా ఘటన బాధితురాలి తల్లిదండ్రులు ఇది వరకు కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు.