‘విశ్వంభర’కు అంత బడ్జెట్ కుదరదంటున్న ఓటీటీ

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘విశ్వంభర(Viswambhara)’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’కు తాజాగా ఓటీటీ సమస్య ఎదురైందని సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు మేకర్స్. ఈ మూవీ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయ్యారు. దీంతో చిరూ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ‘విశ్వంభర’ నిలిచింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు భారీ ఆసక్తి చూపుతున్నా ఓటీటీలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇంట్రస్ట్ చూపట్లేదట. ఈ సినిమాకు మేకర్స్ కోరినంత ఇచ్చేందుకు విముఖత చూపుతున్నాయన్న మాట వినిపిస్తోంది.

- Advertisement -

తెలుగు, హిందీ స్టార్స్ సినిమాలపై ఈ మధ్య ఓటీటీ సంస్థల ఆసక్తి కాస్త సన్నగిల్లినట్లే కనిపిస్తోంది. వీరి సినిమాలను కొనుగోలు చేసే విషయంలో ఓటీటీ సంస్థలన్నీ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర(Viswambhara)’కు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి రూ.40 కోట్ల ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయట. అలా ఎలా కుదురుతుందని మేకర్స్ ప్రశ్నించినా అంతకు మించి ఈ సినిమాపై ఖర్చు చేయలేమని ఖరాఖండిగా చెప్తున్నాయని టాక్. పైగా మూవీ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఎంత అడిగి తమ ఓటీటీ లెక్కలు వేరేలా ఉంటాయని, ఒక ఓటీటీ సంస్థ ఒక సినిమాకు రేట్ ఫిక్స్ చేసేటప్పుడు ఆ సినిమాపై ఉన్న అంచనాలు, మార్కెట్ విలువ, తమ బడ్జెట్ వంటి మరెన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని, ఆ ప్రకారమే ‘విశ్వంభర’కు ఈ రేట్ ఫిక్స్ చేశామని ఓటీటీ(OTT) యాజమాన్యాలు చెప్తున్నాయట.

Read Also: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక రణ్‌వీర్ సింగ్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...