సీఎం కేజ్రీవాల్‌కు ఘనస్వాగతం.. కేసు నమోదు చేసిన పోలీసులు

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal).. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేలుస్తూ భారీగా ఆయనకు స్వాగతం పలికారు. ఇదే ఇప్పుడు వారికి కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. కేజ్రీవాల్‌కు పార్టీ కార్యకర్తలు పలికిన స్వాగతంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం ఉన్నప్పటికీ ఆప్ కార్యకర్తలు బాణాసంచా ఎలా కాల్చారంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్(Kejriwal) తన భార్యతో కలిసి ముందగా వెళ్లి హనుమంతుడిని దర్శించుకున్నారు. వారితో పాటు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ జైన్‌లు కూడా కన్నాట్‌ హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.

Read Also: రోడ్డు ప్రమాద బాదితులకు ప్రభుత్వ పరిహారం
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...