భారతదేశంలోని ప్రతి వంటగదిలో ఉండే మసాలా దినుసు మిరియాలు(Black Pepper). వీటిని పొడి చేసి అనేక వంటల్లో వినియోగిస్తారు. కానీ ఈ తరం వీటిని తినడం వల్ల లాభం ఏంటో తెలియక వీటిని దూరం పెడుతున్నారు. కానీ రోజూ నల్ల మిరియాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నో ఎన్నో సమస్యలకు ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఎసిడిటీ లేదా గ్యాస్టిక్ ట్రబుల్.. ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడం అధికం కావడంతో చాలా వరకు యువతకు బాధిస్తున్న సమస్య ఇది. ఏది తినాలన్నా, తాగలాన్న ఎసిడీటీని తలుచుకుని భయపడుతుంటారు. కానీ ప్రతిరోజూ చిటికెడు బ్లాక్ సాల్ట్, నల్ల మిరియాల పొడిని గోరు వెచ్చని నీటితో తీసుుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
అంతేకాకుండా మిరియాల్లో ఉండే పైపెరిన్.. యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుందని తద్వారా నిరాశ, ఉద్రిక్త, మనసు ఆందోళన చెందడం వంటి సమస్యలు సమసిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
దాంతో పాటుగా ప్రతి రోజై రాక్ సాల్ట్(కల్లుప్పు), మాయఫల(మజుఫాల్), నల్ల మిరియాల పొడిని సమపాళ్లలో తీసుకుని అందులో ఆవనూనె కొద్దిగా కలిసి దంతాలు, చిగుళ్లకు పట్టించి అరగంట ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు బలంగా తయారవుతాయని, వీటి సమస్యలు కూడా సమసిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
అంతేకాకుండా నల్లమిరియాలు(Black Pepper) మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సీ, ఏ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. వీటితో పాటుగా సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమం కల్పిస్తాయి నల్లమిరియాలు.
డీహైడ్రేషన్ సమస్యకు కూడా నల్లమిరాయాలు బాగా పనిచేస్తాయి. నల్ల మిరియాల పొడిని ఉదయం సమయంలో గోరువెచ్చని నీటితో తీసుకోవడం ద్వారా శరీరంలోని నీటి శాతంలో వచ్చే మార్పులను సరిచేస్తుందని, డీహైడ్రేషన్ లేకుండా చూసుకుంటుందని నిపుణులు చెప్తున్న మాట.