బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో రిషబ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్(Shubman Gill) మధ్య పాట్నర్‌షిప్ అందరిని అబ్బుపరిచింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. 67 పరుగులకే భారతజట్టు 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరు జట్టును నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్, రిషబ్ పంత్ కలిసి 167 పరుగుల భాగస్వామ్యాన్ని స్థాపించారు. ఇద్దరూ శతకాలతో.. ప్రత్యర్థి బౌలింగ్‌ని చితకబాదారు. ఇద్దరు ప్లేయర్లు కూడా ఏమాత్రం కంగారు లేకుండా వెర్సటైల్‌గా మ్యాచ్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరి పాట్నర్‌షిప్‌పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దీంతో తమ సక్సెస్‌ఫుల్ పాట్నర్‌షిప్ వెనుకున్న అసలు కారణాన్ని పంత్ వివరించారు.
‘‘నాకు శుభ్‌మన్‌కు మైదానంలోనే కాకుండా బయట కూడా మంచి స్నేహం ఉంది. పర్సనల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తితో ఆడటం చాలా బాగుంటుంది. మా మధ్య అటువంటి స్నేహం ఉండటమే మా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది. మేము మ్యాచ్‌లో చాలా సరదాగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, మ్యాచ్ గురించి చర్చించుకుంటూ ఆడాం. దీని వల్ల మ్యాచ్ ఒత్తిడి చాలా వరకు తగ్గిపోయింది. దాంతో చాలా ఫ్రీగా ఆడగలిగాం. ఒత్తిడిని పక్కనబెట్టి మ్యాచ్‌ను ఆస్వాదించాం. ఏది ఏమైనా ఆట చివరికి ఏం సాధించాలో మాకు బాగా తెలుసు’’ అని Rishabh Pant చెప్పుకొచ్చాడు.