ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయిన తర్వాత కుల వివాదాలు వస్తూనే ఉన్నాయి.. ఇది 2014 ఎన్నికల్లో గెలిచిన వారికి కూడా చుట్టుకున్నాయి..తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశం తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.దేవి ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.. ఈ మేరకు ఆమెకు నోటీసులు పంపారు. శ్రీదేవి ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు.. ఆధారాలతో రావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక ఆమె ఎస్సీ కాదు అని తేలితే ఆమె ఎమ్మెల్యే పదవి కోల్పోతుంది అని చెబుతున్నారు..తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఇక్కడ అసలు వివాదం మొదలైంది. శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. తాను క్రిస్టియన్.. తన భర్త కాపు అంటూ ఆమె వ్యాఖ్యానించారట..దీంతో పిటిషన్ వేశారు. దీనిపై ప్రెసిడెంట్ కు ఫిర్యాదు అందడంతో దీనిపై విచారణకు ఆదేశించారు.
తర్వాత ఎన్నికల కమిషన్కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ సీఎస్ను విచారణ జరపాలని ఆదేశించింది. దీనిపై ఆమె ఎలాంటి ప్రూఫ్ ఇస్తారో చూడాలి.