మైగ్రేన్ తలనొప్పి వస్తుందా.. వీటిని ట్రై చేయండి..

-

మైగ్రేన్(Migraine).. ఈ కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కుర్రవాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. దీనికి చికిత్స లేదు.. మందులు వాడుకుంటూ కంట్రోల్ చేసుకోవడమే మార్గం. ఈ మైగ్రేన్ తలనొప్పి పలానా కారణం వల్ల వస్తుందని చెప్పడం కష్టమని, ఇది రావడానికి అనేక కారణాలు ఉండొచ్చని వైద్యులు కూడా చెప్తున్నారు. కానీ ముందుగానే కొన్నికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనిని కంట్రోల్ చేయొచ్చని చెప్తున్నారు. అయితే ముందుగా అసలు మనకు వస్తున్నది మైగ్రేన్ తలనొప్పేనా అన్నది తెలుసుకోవాలి. ఈ మైగ్రేన్ తలనొప్పిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నాలుగు రోజులకు మించి తలనొప్పి బాధిస్తున్నా.. వచ్చీ తగ్గుతూ ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యుడు అందించిన మెడికేషన్ వినియోగించడంతో పాటు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్‌ను కంట్రోల్ చేయొచ్చు. మరి అదెలానో చూసేద్దాం..

- Advertisement -

ఒత్తిడి తగ్గించుకోవడం, బాడీనీ, మెదడును రిలాక్స్ చేసే టెక్నిక్స్ పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళ తప్పకుండా ఆహారం తీసుకోవడం వీటిలో ప్రాథమికంగా, ప్రధానంగా పాటించాల్సినవని వైద్యులు చెప్తున్నారు.

అంతేకాకుండా మైగ్రేన్(Migraine) ఉన్న వాళ్లు చీజ్, నట్స్, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. దాంతో పాటుగా శరీరానికి సరిపడా నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. గోరు వెచ్చని నీటితో స్నానం, యోగా, మెడిటేషన్ కూడా చేయడం మంచిదని వైద్యులు అంటున్నారు. ఇలా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ ట్రిగ్గర్ కాకుండా 50శాతం నివారించొచ్చు. వీటన్నింటితో పాటు జ్యూస్‌లకు పెద్దపీట వేస్తూ.. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.

Read Also: లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...