టిఫిన్ చేయడం మానేస్తే ఇన్ని తిప్పలా..!

-

రోజూ ఉదయాన్ని అల్పాహారం అదే నండి టిఫిన్(Breakfast) చేయడం అందరికీ అలవాటు. కానీ కొందరు బరువు తగ్గాలనో, ఇతర ఆరోగ్య కారణాల పేరిటో టిఫిన్ చేయడం మానేస్తారు. ఒక్కసారిగా టిఫిన్‌ తినడానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, అల్పాహారమే కాదా అనుకుంటే అంతులేని సమస్యలా మారే ప్రమాదాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికీ అల్పాహారం చాలా ముఖ్యమని, ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే టిఫిన్ మానేద్దామని అనుకుంటుంటే టిఫిన్ స్థానంలో ఆయిల్ ఫుడ్‌కు స్వస్తి పలికి మరేదైనా పోషకాహారం తీసుకోవడం మేలు చేస్తుందని, అలా కాదని ఒక్కసారిగా టిఫిన్ తినడం మానేస్తే అది మేలు కన్నా కీడే ఎక్కువగా చేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఒక్కసారిగా టిఫిన్ చేయడం మానేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందంటే..

- Advertisement -

చికాకు: అల్పాహారం తీసుకోకపోవడంతో అందరికీ వచ్చే తొలి ఇబ్బంది.. చిరాకు. కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే.. తొలుత వచ్చేది చికాకే. న్యూరోట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావింతం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మనం అల్పాహారంం తీసుకోవడం మానేయడం వల్ల ఈ సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని వల్ల చికాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు అధికమవుతాయని వైద్యులు చెప్తున్నారు.

మెటబాలిక్ సిండ్రోమ్: టిఫిన్ తీసుకోకపోవడం వల్ల మన మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతింటోంది. దీని వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని అధికమవుతోంది. ఇది గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికమవుతాయి.

పోషకాల కొరత: రోజూ తీసుకునే అల్పాహారాన్ని ఒక్కసారిగా మానేయడం, అలాగే కొనసాగించడం వల్ల శరీరానికి కావాల్సిన, తరచుగా వచ్చే పోషకాల లోటు ఏర్పడుతుంది. దాంతో పాటుగా మన శరీరంలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లోపించే ప్రమాదం ఉంది. ఇదొక్కటే అనేక వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్న మాట.

గుండె జబ్బులు: అల్పాహారం తీసుకోవడం ఒక్కసారిగా మానేయడం వల్ల గుండె పోటు, రక్తపోటు పెరుగుతాయి. గుండె సంబంధిత అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్‌లు కూడా అధికం అవుతాయి. ఇది తీవ్రస్తాయిలో ఉండే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

అధిక బరువు: ఏ బరువు తగ్గుదామని టిఫిన్(Breakfast) మానేయాలని అనుకుంటున్నారో.. వారు బరువు అధికంగా పెరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. కాగా ఈ సమయంలో పెరిగే బరువు అనేక వ్యాధులకు కారణం అవుతుందని చెప్తున్నారు. సాధారణంగానే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. దాని వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. మన మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.

అంతేకాకుండా మన జీవితంలో దేనినైనా ఒక్కసారిగా మానేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని, కాబట్టి అది చెడు అలవాటైనా, మంచి కోసం చేస్తున్న మార్పైనా చిన్నచిన్నగా చేయడం లేదా వైద్యుల సలహా మేరకు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Read Also: బొప్పాయి ఆకులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...