బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)కి తన తాజాగా సినిమా ‘గూఢచారి 2(Goodachari 2)’ షూటింగ్‌లో గాయమైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న సెట్‌లో జరిగిన ప్రమాదంలో ఇమ్రాన్‌కు ఈ గాయమైంది. ఒక చోట నుంచి మరో చోటకు జంప్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ మెడకు గాయమైంది. మెడ కట్ అయి.. స్వల్పంగా రక్తం రావడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్తున్నారు. ఒక వారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించారని మూవీ యూనిట్ నుండి వినిపిస్తున్న మాట.
‘గూఢచారి’ సినిమాతో క్లీన్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్(Adivi Sesh). ఆ సినిమా అప్పటి నుంచి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కిన విషయం విని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఇమ్రాన్(Emraan Hashmi) గాయమైన విషయం తెలుసుకుని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.