‘ఆయన వల్లే సినిమా ఫ్లాప్’.. రజినీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

-

లింగ’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అంటూ ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్(Director Ravikumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి కాంబోలో వచ్చిన ముత్తు, నరసింహ బ్లాక్‌బస్టర్లు అయినప్పటికీ ‘లింగ(Lingaa)’ ఫ్లాప్‌కు మాత్రం పూర్తిస్థాయిలో రజినీకాంతే కారణమని ఆరోపించారు. ‘‘లింగ సినిమా క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ ఉంది. కానీ దానిని పట్టుబట్టి రజినీకాంత్ తీసేపిచ్చారు. చెప్పినా ఆయన వినలేదు. సెకండాఫ్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. గ్రాఫిక్స్‌కు తగిన సమయం కూడా ఇవ్వలేదు. లింగ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా రజినీకాంత్ అతిగా జోక్యం చేసుకున్నారు. సీజీఐ ఇలా ఏ పనికీ సరిపడా సమయం నాకివ్వలేదు. క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ అనుకున్నాను. దానిని కూడా తీసేశారు. అనుష్క ఉన్న ఓ పాటను కూడా తీసేశారు’’ అంటూ రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఆ ఐడియా కూడా ఆయనదే..

‘‘ఒక ఫైట్‌లో రజనీ కాంగ్.. బ్రిడ్జ్‌పై నుంచి ఓ హాట్ ఎయిర్ బెలూన్‌పైకి దూకుతారు. దీనికి బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆ ఐడియా కూడా రజినీకాంత్‌(Rajinikanth)దే. సినిమా మొత్తాన్ని ఈ ఒక్క సీన్ చెడగొట్టేసింది. నేను అనుకున్న సినిమానే తీసి ఉంటే హిట్ అయి ఉండేదేమో. కానీ ఎంత చెప్పినా వినకుండా రజినీకాంత్ పనికిమాలిన, అనవసర మార్పులు చేయడం. అనవసర సీన్లు యాడ్ చేయడం వల్లే సినిమా ఫెయిల్ అయింది’’ అని ఆయన(Director Ravikumar) చెప్పుకొచ్చారు. అయితే రజినీకాంత్ హీరోగా అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు వచ్చిన సినిమానే ‘లింగ’. ఈ సినిమాను 2014లోనే రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ తీరా చూస్తే డిజాస్టర్‌గా మిగిలి నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Read Also: బాలీవుడ్ రొమాంటిక్ హీరోకు గాయం.. ఆ సినిమా షూటింగ్‌లోనే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అక్రోట్లతో అద్భుతమైన ఆరోగ్యం..

ఆరోగ్యంపై అవగాహన ఇప్పుడిప్పుడే అధికం అవుతోంది. యువత కూడా తమ ఆరోగ్యంపై...

లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల లైసెన్సులు

AP Liquor License | ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది...