బాబర్‌పై వేటు.. పీసీబీ తీవ్ర ఆగ్రహం

-

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌(Babar Azam)పై ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ వేటు వేసింది. ప్రస్తుతం ఇదే టాక్‌ అరౌండ్ ద వరల్డ్‌గా నడుస్తోంది. బాబర్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబర్‌ను నెక్స్ట్ సీజన్‌కు పక్కన పెడుతూ పీసీబీ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ తీవ్రంగా ఖండించాడు. ప్రశ్నించాడు కూడా. కోహ్లీని, బాబర్‌ను పోలుస్తూ అతడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. దీనిపై పీసీబీ మండిపడింది. కాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చూపినందుకే బాబర్‌పై వేటు వేసింది పీసీబీ. ఆ టెస్ట్‌లో పాకిస్థాన్ అత్యంత చెత్తగా ఓడిపోయింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో బాబర్.. 30 బంతులు ఆడి 5 పరుగులే చేశాడు. దీంతో తదుపరి రెండు టెస్ట్‌లు ఆడే జట్టు నుంచి బాబర్‌ను పీసీబీ తొలగించింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ఫకర్ పెట్టిన పోస్ట్ కీలకంగా మారింది.

- Advertisement -

‘‘బాబర్‌(Babar Azam)పై తీసుకున్న యాక్షన్ ఆందోళన కరంగా ఉంది. 2020-2023 మధ్య 19,33,28,26,50 సగటుగా రాణిస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీని బీసీసీఐ పక్కనపెట్టలేదు. కానీ బాబర్ విషయంలో మాత్రం పీసీబీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరం. పాకిస్థాన్ సృష్టించిన అత్యుత్తమ బ్యాటర్ బాబర్ అనడంలో సందేహం లేదు. అలాంటి ప్లేయర్‌ని పక్క పెట్టాలన్న నిర్ణక్ష్ం జట్టులో ప్రతికూల సందేశాన్ని నింపుతుంది. కీలక ఆటగాళ్లను అణగదొక్కేకన్నా వారిని కాపాడుకోవడం ముఖ్యం. దానిపైనే దృష్టిపెట్టాలి కూడా’’ అని ఫకర్ పోస్ట్ పెట్టాడు.

Read Also: వాయిదా పడ్డ కేటీఆర్ పరువు నష్టం దావా విచారణ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అక్రోట్లతో అద్భుతమైన ఆరోగ్యం..

ఆరోగ్యంపై అవగాహన ఇప్పుడిప్పుడే అధికం అవుతోంది. యువత కూడా తమ ఆరోగ్యంపై...

లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల లైసెన్సులు

AP Liquor License | ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది...