మొదలు కానున్న ‘ఓజీ’

-

OG Shooting | పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా ‘ఓజీ’. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ఒక ఊపు ఊపేశాయి. ఈ సినిమా ఈ ఏడాదే వస్తుందని అభిమానులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పవన్‌కు సమయం దొరక్క.. సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు. దాంతో ‘ఓజీ’ సినిమా షూటింగ్ కాస్తా అటకెక్కిన పరిస్థితి ఏర్పడింది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో మళ్ళీ కదలిక వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా షురూ అవుతున్నాయి. వాటి లిస్ట్‌లో తాజాగా ‘ఓజీ’ కూడా చేరింది. ఈమేరకు ‘ఓజీ’ షూటింగ్ తిరిగి ప్రారంభమైందని సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

OG Shooting | ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. హీరోకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మూవీ టీమ్ చెప్తోంది. వీటిలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని, వాటిని నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో చిత్రీకరిస్తున్నట్లు మూవీ యూనిట్ చెప్తోంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్.. ‘ఓజీ’ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు చిత్ర సంస్థ తెలిపింది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాను కూడా పవన్ కల్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.

Read Also: లెమన్ వాటర్‌తో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...