కొత్తకారు కొన్న సల్మాన్ ఖాన్.. ప్రాణభయంతోనే..

-

కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రాణాలకు ముప్పు ఉందన్న సంకేతాలు భారీగా వస్తున్నాయి. గతేడాది సల్మాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పులకు సంబంధించి ఇటీవల హరియాణాలో ఒకరికి అరెస్ట్ చేయడం, రూ.5 కోట్లు ఇస్తే సత్మాన్‌ను వదిలేస్తామంటూ పోలీసులకు బెదిరింపు లేఖ రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో సల్మాన్‌ ఖాన్‌కు కూడా ప్రాణభయం పెరిగింది. అందుకే తాజాగా సరికొత్త కారు కొన్నారు. అదేంటి కొత్త కారు కొంటే ప్రాణభయం పెరిగినట్లా అని అనుకోవచ్చు. ఆ కొన్న కారు బుల్లెట్ ప్రూఫ్ అయితే అది కచ్ఛితంగా ప్రాణ భయం వల్ల చేసిన కొనుగోలే అవుతుంది. సల్మాన్ కొత్త కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రస్తుతం బీటౌన్ అంతటా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది.

- Advertisement -

తాజాగా రూ.2కోట్లతో దుబాయ్ నుంచి నిస్సాన్ కంపెనీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నాడు. ఈ కారు భారత్‌లో లభించదు. దాంతో దుబాయ్ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకున్నాడు. ఇప్పటికే సల్మాన్(Salman Khan) దగ్గర రూ.6కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూవ్ కారు కూడా సల్మాన్ దగ్గర ఉంది. కానీ సరికొత్త ఫీచర్లు ఉండటంతో ఇప్పుడు మరో కారు కొన్నాడు. ఈ కొత్త కారులో లోపల ఎవరు కూర్చుని ఉన్నారు అన్నది బయటి వారికి కనిపించదు. అదే విధంగా ఏ బుల్లెట్‌ అయినా ఈ కారు అద్దాన్ని పగలగొట్టలేదు.

Read Also: కరివేపాకుతో కమ్మని ఆరోగ్యం మీ సొంతం..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహారాష్ట్ర ఎన్నికలకు ఆ సత్తా ఉంది: అఖిలేష్

దేశ రాజకీయాలను మార్చే సత్తా మహారాష్ట్ర ఎన్నికలకు ఉందంటూ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ...

ఒత్తిడి తేవడం సర్ఫరాజ్‌కు వెన్నతో పెట్టిన విద్య: కుంబ్లే

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్(Sarfaraz Khan) ఆటపై మాజీ ఆటగాడు అనిల్...