బతుకైనా.. చావైనా సినిమాల్లోనే.. షారుఖ్ షాకింగ్ కామెంట్స్

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన సినిమా కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితాంతం నటుడిగానే ఉండాలనుందని చెప్పాడు. భారతదేశ చిత్ర పరిశ్రమకు అతడు అందించిన సేవలకు గానూ షారుఖ్. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌(Locarno Film Festival)లో జీవిత సాఫల్య అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగానే తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జీవితాంతం నటుడిగానే కొనసాగుతారా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ షారుఖ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. వీలైతే నా చావు.. ఆఖరి క్షణాలు కూడా సినిమా సెట్స్‌లోనే జరగాలన్నదే తన సంకల్పం అని చెప్పుకొచ్చాడు. అతని సమాధానంతో అంతా ఒక్క క్షణం షాకయ్యారు.

- Advertisement -

‘‘చనిపోయే వరకు సినిమాల్లోనే ఉంటా. ఏదైనా సినిమా సెట్‌లో యాక్షన్ చెప్పిన తర్వాతే తుదిశ్వాస విడవాలి. వాళ్లు కట్ చెప్పాక కూడా లేవకూడదు. అదే నా కోరిక. నాకొచ్చిన స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయి. నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. కానీ ప్రజలు ఇప్పుడు చాలా సున్నిత మనస్కులయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు’’ అని షారుఖ్(Shah Rukh Khan) చెప్పుకొచ్చాడు.

Read Also: కొత్తకారు కొన్న సల్మాన్ ఖాన్.. ప్రాణభయంతోనే..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....