విమానాలకు బెదిరింపు కాల్స్(Bomb Threats) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రమంత్రి హెచ్చరించిన గంటల వ్యవధిలోనే మరోసారి పలు విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఇది ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడంలా మారింది. దీనిని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందనేది చూడాలి. అయితే ఇండిగో సంస్థకు చెందిన మరో 10 విమానాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. దేశీయ సేవలేకాకుండా జెడ్డా, ఇస్తాంబులు, రియాద్ లాంటి అంతర్జాతీయ సర్వీలను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయని వారు తమ ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క వారంలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన 100కుపైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు.
‘‘ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు(Bomb Threats) రావడంతో మా సిబ్బంది అప్రమత్తమైంది. ప్రయాణికులను తరలించి తనిఖీలు చేస్తున్నాం. సంబంధిత అధికారులకు సమాచారం కూడా అందించాం’’ అని ఇండియా ఉన్నతాధికారులు వెల్లడించారు.