Hair Fall Control | హెయిర్ ఫాల్‌కు అద్భుత చిట్కాలు.. ఇవి వాడితే రాలమన్నా జుట్టు రాలదు..!

-

Hair Fall Control | ప్రతి ఒక్కరి అందాన్ని జుట్టు రెట్టింపు చేస్తుంది. ఇందులో సందేహం లేదు. అందులోనూ నల్లని, వత్తైన జుట్టు ఉన్నవారిలో ఎట్రాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది మగవారైనా, ఆడవారైనా వారి జుట్టే వారికి అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం పరుగుల ప్రపంచంలో కౌమార దశలోనే జుట్టు రాలడం మొదలై యువకులను సైతం ఆత్మనిమ్యూనతకు గురిచేస్తుంది. వివాహ వయసుకు వచ్చేసరికి బాడీని ఎంత మెయింటెన్ చేసినా.. పైన బట్ట మాత్రం మన కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంటుంది. ఇందుకోసం చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లి అనేక ట్రీట్‌మెంట్లు చేసుకుంటుంటారు. మరికొందరు విగ్గుల మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు, జుట్టు ఆరోగ్య నిపుణులు మాత్రం కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు పూర్తి మానేలా చేయొచ్చంటున్నారు. దానికి తోడుగానే నల్లని, వత్తైన, దృఢమైన జుట్టును సొంతం చేసుకొచ్చవని, కాకపోతే కాస్తంత ఓపికగా వీటిని వినియోగించుకోవాలని చెప్తున్నారు.

- Advertisement -

సాధారణంగా జుట్టును ప్రత్యేక శ్రద్ధతో మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో ఏర్పడే చిన్నచిన్న లోపాలు కూడా జుట్టు రాలడానికి కారణం కావొచ్చు. కాగా కొన్ని హెయిర్ మాస్క్‌లను అప్లై చేయడం వల్ల మన జుట్టు బలపడేలా చేసుకోవచ్చు. అంతేకాకుండా వత్తైన జుట్టును పెంచడం కూడా సాధ్యమవుతోందని అంటున్నారు నిపుణులు. కాగా బయట దొరికే వాటికన్నా మెరుగైన ప్రయోజనాలను కలిగించే హెయిర్ మాస్క్‌లకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. వీటికి ప్రత్యేక పదార్థాలు కూడా అవసరం లేదని, మన ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసేసుకోవచ్చని అంటున్నారు. మరి ఆ మాస్కులేంటో.. వాటిని ఎలా తయారు చేసుకుని వినియోగించాలో తెలుసుకుందామా..

కొబ్బరినూనె, అవకాడో: అరకప్పు అవకాడో గుజ్జు, రెండు టేబుల్ స్కూన్‌ల కొబ్బరినూని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి.. ఒక ఐదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాలు ఆగి ఎప్పుడూ వినియోగించే షాంపుతోనే తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. అవకాడాలో ఉండే విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తాయి. కొబ్బరి నూనె ఎప్పటిలానే జుట్టు బలాన్ని పెంచుతుంది.

తేనె, పెరుగు: అర కప్పు పెరుగు, రెండు టీ స్పూన్‌ల తేనె, నచ్చితే ఒక గుడ్డు సొనను ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అంటేనా అప్లై చేయాలి. ఆ తర్వాత 30 నిమిషాలు ఆగి సాధారణ షాంపుతోనే తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల మన జుట్టు మృధువుగా మారడమే కాకుండా బలంగా కూడా ఉంటుంది. ఇందులోని పెరుగు జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తుంది. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా(Hair Fall Control) చేస్తుంది. గుడ్డు మన జుట్టు బలానికి పనిచేస్తుంది.

ఆలివ్ ఆయిల్, గుడ్డు: రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, నిమ్మరసం ఒక చెంచా, ఒక గుడ్డు సొనను బాగా కలుపుకుని జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులో వినియోగించిన గుడ్డు జుట్టుకు కావాల్సిన ప్రొటీన్స్‌ను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు కావాల్సిన తేమను, నిమ్మరసం జుట్టుకు కావాల్సిన మెరుపును అందిస్తాయి. అయితే వీటిని పాటించే ముందు వీటిలో దీనితో అయినా మీకు ఎలర్జీ ఉందేమో చూసుకోవాలి. లేని పక్షంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిపుణుల సలహాతో చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు చెప్తున్న మాట.

Read Also: వెల్లుల్లితో వెలకట్టలేనన్ని లాభాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

CP CV Anand | ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో నిందితుడు అతడే..!

సికింద్రాబాద్ పరిధిలో మోండామార్కెట్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై(Muthyalamma Temple) ఇటీవల ఓ దుండుగుడు...

Best Face Mask | తెల్లని చర్మం కోసం తేలికైనా చిట్కాలు..

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే...