సల్మాన్ ఖాన్(Salman Khan)కు ఈ మధ్య వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5కోట్లు ఇవ్వాలంటూ ముంబై పోలీసులకు ఓ మెసేజ్ రావడం దేశమంతా సంచలనంగా మారింది. దీంతో ఈ విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. తాజాగా ఈ బెదిరింపులకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్(Jharkhand)కు చెందిన 24ఏళ్ల కూరగాయల వ్యాపారిని ముంబై పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్రీ మనీ కోసమే అతడు ఈ ప్లాన్ చేశాడని అధికారులు భావిస్తున్నారు.
సల్మాన్(Salman Khan)ను బెదిరించడం తాను కావాలని చేసిన పనికాదని సదరు కూరగాయల వ్యాపారి చెప్తున్నాడు. ‘‘నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగింది. నన్ను క్షమించండి’’ అని ఆ యువకుడు పోలీసులకు విచారణలో చెప్పినట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే కృష్ణజింకలను వేటాడిన నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని నిశ్చయించుకుని కుట్రలు పన్నింది. గతేడాది ఇదే అంశానికి సంబంధించి కొందరు దుండగులు సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులకు కూడా పాల్పడ్డారు. కొంత కాలంగా వరుస బెదిరింపులు కూడా వస్తున్నాయి సల్మాన్ ఖాన్‌కు.