విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తాజాగా తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనను జీవితంలో రెండే రెండు విషయాలు అత్యధికంగా బాధించాయని వివరించారు. తాజాగా ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ తన జీవితంలోని బాధాకరణ క్షణాలను గుర్తు చేసుకున్నారు ప్రకాష్ రాజ్. తన కుమారుడి మరణంతో పాటు స్నేహితురాలు గౌరీ లంకేష్(Gauri Lankesh) మరణం తనను తీవ్రంగా బాధించాయని చెప్పుకొచ్చారు. కానీ జీవితంలో అలానే బాధతో ఉండిపోతే ఎలా? ముందుకు సాగాలి కదా? అని గ్రహించి ముందడుగు వేశాను అని అన్నారు.
‘‘ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు. నాకు ఓ కుటుంబం ఉంది. నాకు ఒక వృత్తి ఉంది. నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి. నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకు తిరిగి మళ్ళీ నిలబడ్డాను’’ అని ప్రకాష్(Prakash Raj) చెప్పుకొచ్చారు.