మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఖాతాలో మరో అవార్డు చేరింది. ఎన్నారై జాతీయ అవార్డును(ANR National Award) ఈరోజు చిరంజీవి దక్కించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఏఎన్ఆర్(ANR) జాతీయ అవార్డుల ఫంక్షన్‌లో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నాడు చిరంజీవి. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకానొక సమయంలో తన గురించి అమితాబ్ బచ్చన్ అన్న మాటలు విని వణుకు పుట్టిందని చెప్పారు చిరంజీవి. ‘‘ముందుగా నా గురువు, మెంటార్, స్ఫూర్తిదాత అమితాబ్(Amitabh Bachchan)కు ధన్యవాదాలు. నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడు అవార్డు వచ్చినా ఆయన నుంచే నాకు తొలి శుభాకాంక్షలు అందుతాయి. కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా నేరుగా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయనలాంటి స్టార్ వచ్చి నాకు అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సమయంలో సినీ పరిశ్రమ నన్ను సన్మానించింది. ఆ సమయంలో నా గురించి మాట్లాడుతూ.. ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని అమిత్ అన్నారు. ఆ మాటలు విన్నాక నాలో చిన్న వణుకు పుట్టింది. నా నోట మాట రాలేదు. నా మనసు ఆనందోత్సాహంతో గెంతులేసింది. ఆ రోజు ఆయనకు ధన్యవాదాలు కూడా సరిగా చెప్పానో లేదో కూడా గుర్తు లేదు. అలా ఉంది అప్పుడు నా పరిస్థితి. ఇండియన్ సినిమాకు బాద్‌షా, షెహన్‌షా, చక్రవర్తి అయిన అమితాబ్ నోట అలాంటి మాటలు రావడం అంటే ఎంత పెద్ద విషయమే కదా.. ఆయన మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’’ అని చెప్పారు చిరంజీవి(Chiranjeevi).
Read Also: చిరంజీవి గ్రేస్ చూసి భయమేసింది: నాగార్జున
Follow us on: Google News, Twitter, ShareChat