తమిళ హీరో సూర్య(Surya) తన కుటుంబంతో సహా ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అంత అత్యవసరంగా ఎందుకు షిఫ్ట్ అయ్యారు అన్నది అప్పటి నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. తాజాగా ఈ అంశంపై హీరో సూర్య స్పందించాడు. ఊహించని మార్పులు వచ్చాయని, తన కుటుంబం, తన కోసం తన భార్య జ్యోతిక(Jyothika) ఎన్నో త్యాగాలు చేసిందని సూర్య.. జ్యోతికను కొనియాడాడు. ఆమె కోసమే ముంబైకి షిఫ్ట్ అయినట్లు చెప్పకనే చెప్పారు. జ్యోతిక 18 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చిందని, తనతో పెళ్ళి తర్వాత చెన్నైలోనే ఉండిపోయిందని, తన కోసం తన కుటుంబం కోసం ఎన్నో వదులుకుందని చెప్పుకొచ్చాడు. ముంబైలోని తన స్నేహితులు, జీవనశైలి, కెరీర్ ఇలా ఎన్నో కీలక విషయాలకు త్యాగం చేసిందని, కరోనా తర్వాత మార్పు అవసరం అనిపించిందని, అందుకే ముంబైకి(Mumbai) షిఫ్ట్ అయ్యామని వెల్లడించాడు సూర్య.
‘‘ఇప్పుడు జ్యోతికకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయి. విభిన్న ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సవాళ్లను ఎదర్కొంటోంది. నేను గొప్ప దర్శకులతో పని చేయాలనుకుంటే తాను మాత్రం కొత్త దర్శక, నిర్మాతలతో పనిచేయాలని అనుకుంటుంది. పురుషుల్లాగే మహిళలకు కూడా సెలవులు, స్నేహాలు చాలా అవసరం. ఇప్పుడు జ్యోతిక తన కుటుంబం, పాత స్నేహితులతో సమయం గడుపుతోంది. వృత్తిపరంగా కూడా బిజీగా ఉంది. నేను ముంబైలో ఉన్న సమయంలో పూర్తిగా పనిని పక్కనపెట్టేస్తా. నెలలో 10 రోజులు కుటుంబానికే కేటాయిస్తా’’ అని సూర్య(Surya) చెప్పాడు.
Read Also: మళ్ళీ రానున్న ‘మిర్జాపూర్’.. ఈసారి ఎలా అంటే..
Follow us on: Google News, Twitter, ShareChat