కేరళ(Kerala)లో కాసర్‌గాడ్‌లోని ఓ ఆలయంలో భారీ పేలుడు సంభవించింది. ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల సమయంలో బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు. అంజోతంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్లం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో సమీపంలోనే బాణాసంచా నిల్వ ఉంచారు. అందులో మంటలు చెలరేగడంతో అది భారీ ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులకు కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు.
Kerala | భద్రతా రాహిత్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. బాణాసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోపు క్రాకర్లు కాల్చకూడదన్న నిబంధనను పాటించలేదు. నిల్వ ఉంచడానికి కూడా అనుమతి తీసుకోలేదని విచారణలో తేలింది. ఘటన స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశాం అని కలెక్టర్ వెల్లడించారు.