సెలబ్రిటీ జంట దీపిక(Deepika Padukone)-రణ్‌వీర్(Ranveer Singh)లకు ఇటీవల పండంటి పాప పుట్టింది. ఇప్పటి వరకు తమ ముద్దుల కుమార్తెను ప్రపంచానికి చూపని దీపక జంట.. తాజాగా తమ కుమార్తెకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. అదే వాళ్ల పాపకు పెట్టిన పేరు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. వారు తమ కుమార్తెకు దువా పదుకొణె అని నామకరణం చేసినట్లు వాళ్లు వివరించారు. ‘దువా(Dua)’ అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు ఫలితమే తమ కూతురు అన్న భావనతోనే ఆ పేరును సెలక్ట్ చేశామని దీపిక జంట ప్రకటించింది. తమ మనసు ప్రేమ, సంతోషంతో ఉప్పొంగిపోతోందని దీపిక తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ సందర్బంగా దీపిక, రణ్‌వీర్ తమ కూతురు పాదాల ఫొటోలను అప్‌లోడ్ చేశారు. వారి ఇచ్చిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుస్ అవుతున్నారు. పేరు చాలా బాగుందని అంటూనే చిన్నారిని ఎప్పుడు పరిచయం చేస్తారంటూ అడుగుతున్నారు ఫ్యాన్స్.
Deepika Padukone | కూతురు పేరు ప్రకటించిన దీపిక పదుకొణె..
-