పవన్ కల్యాణ్ కు గుడ్ న్యూస్

పవన్ కల్యాణ్ కు గుడ్ న్యూస్

0
82

వైసీపీ నేతలు విమర్శలు చేయడం పవన్ కల్యాణ్ వాటికి మళ్లీ కౌంటర్ ఇవ్వడం, ఈ మధ్య రాజకీయంగా మనం చూస్తూనే ఉన్నాం.. అయితే పవన్ పై ఎన్ని విమర్శలు చేస్తే అంత వైసీపీ నేతలకు మైనస్ అవుతోంది.. పవన్ ఒక్కడు, కాని వైసీపీ నేతలు 151 మంది అనేది జనాల్లోకి వెళుతోంది. పవన్ ని ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయంగా దీనికి హైప్ తీసుకువస్తున్నారు.. తనకు తెలిసిన విమర్శల దారి పవన్ చూసుకుంటే, వైసీపీ వాటికి కౌంటర్ ఇవ్వ్డాడానికే ముందుకు వెళుతోంది. కాని గడిచిన మూడు నెలలుగా పవన్ కు ఇది క్లాస్ గా వర్క్ అవుట్ అయింది.

పవన్ కు జనాల్లో క్రేజ్ పెరిగేలా చేసింది.. లాంగ్ మార్చ్ కూడా ఫెయిల్ అయింది అని వైసీపీ అంటే, లక్షలాది మంది జనం దేనికి వచ్చారు అంటూ జనసేన కూడా దానికి కౌంటర్ ఇచ్చింది… సో పవన్ కల్యాన్ ఇదే తీరున వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళితే, వైసీపీ తెలుగుదేశం పై విరక్తి చెంది ఆ పార్టీలో ఇమడలేము అనుకునే వారు పవన్ పంచన చేరే అవకాశం ఉంది. అయితే కొందరు మాత్రం ఇప్పటికే పవన్ పోరాటం చూసి జనసేనలో చేరాలి అని అనుకుంటున్నారట. మరి పవన్ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.