మహారాష్ట్రలో ఎన్నికల వేడి రోజురోజుకు అధికమవుతోంది. ప్రతి పార్టీ కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ అధికారమే టార్గెట్‌గా ముందడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి పార్టీకి అసమ్మతి సెగలు తప్పడం లేదు. ప్రతి పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతల నుంచి అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. కాగా ఈ అసమ్మతి నేతల విషయంలో Shiv Sena(ఉద్ధవ్ వర్గం) కీలక నిర్ణయం తీసుకుంది. అసమ్మతి నేతలందరిపై కఠిన చర్యలు తీసుకుంటూ వేటు వేసింది. నామినేషన్‌లను ఉపసంహరించుకోకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు శివసేన(ఉద్ధవ్ వర్గం) శ్రేణులు చెప్తున్నాయి.
టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా కూడా తమతమ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారంతా కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పార్డీ ఆదేశించింది. మహారాష్ట్రలో నామినేషన్ ఉపసంహరణ ఆఖరు తేదీ సోమవారంతో ముగిసినప్పటికీ ఒక్కరు కూడా నామినేషన్‌ల విషయంలో వెనక్కు తగ్గలేదు. దీంతో వారందరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. కాగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకునేది ఇంకా ప్రకటించలేదు. Shiv Sena పార్టీ శ్రేణులు చెప్తున్నదాని ప్రకారం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అంటున్నారు.