Jharkhand Elections | ఝార్ఖండ్ ఎన్నికల్లో ఇండి కూటమి మేనిఫెస్టో ఇదే..!

-

ఝార్ఖండ్ ఎన్నికలలో(Jharkhand Elections) ఎలాగైనా గెలవాలని ఇండి కూటమి కృషి చేస్తోంది. అందుకోసమే భారీగా ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా ఇండి కూటమి తమ మేనిఫెస్టోను రూపొందించింది. ప్రజలపై వరాల జల్లు కురిపించింది ఇండి కూటమి. మొత్తం ఏడు గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టో రూపొందించింది ఇండి కూటమి. ఝార్ఖండ్‌లో ఉమ్మడిగా నిర్వహించిన సభలో JMM అధ్యక్షుడు, ఝార్ఖండ్ సీఎం హెమంత్ సోరెన్(Hemant Soren), కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), కూటమి పార్టీ నేతలు కలిసి సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగిందని ఇండి కూటమి నేతలు పేర్కొన్నారు.

- Advertisement -

Jharkhand Elections – మేనిఫెస్టోలోని కీలక హామీలివే..

10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు

రూ.450కే సిలిండర్

రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా

ఒక్కో వ్యక్తికి నెలకు 7కేజీల చొప్పన ఆహార ధాన్యాలు

మాజ్య సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు ₹2500

వెనుకబడిన తరగుల వారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కులకు రక్షణ

వరికి కనీస మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3200కి పెంపు

Read Also: ‘వాళ్లు టపాసులైతే.. మేం రాకెట్లం’.. ఝార్ఖండ్ ఎన్నికలపై కేంద్రమంత్రి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rahul Gandhi | కుల గణన అంటే మోదీకి ఎందుకంత భయం: రాహుల్ గాంధీ

దేశంలోని అన్ని వ్యవస్థల్లో, అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందనేది అక్షర...

Rajnath singh | ‘వాళ్లు టపాసులైతే.. మేం రాకెట్లం’.. ఝార్ఖండ్ ఎన్నికలపై కేంద్రమంత్రి

ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్(Jharkhand) కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో...