టీ20 సిరీస్ కోసం టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో నాలుగు టీ20 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, టీమిండియా తలపడనున్నాయి. నవంబర్ 8న డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలవుతుంది. ఇందులో సంజు శాంసన్(Sanju Samson) అత్యంత కీలకం కానున్నాడని, అందరి ఫోకస్ సంజు శాంసన్‌పైనే ఉంటుందని భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) అంటున్నాడు. సంజు ఫామ్‌లో వస్తున్న ఒడిదుడుకులే ఇందుకు కారణమని, ఎమర్జెన్సీ మ్యాచ్‌లలో సైతం నిలకడగా సంజు శాంసన్ రాణించలేకపోవడంతో ఈ సిరీస్‌లో ఎంత మాత్రం రాణిస్తాడనేది కీలకంగా మారింది. పదేళ్ల క్రితమే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా సంజు తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. నిలకడ లేకపోవడం వల్ల తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజు ఫెయిల్ అయ్యాడు. దీని వల్లే చాలా సార్లు తుది జట్టులోకి సంజు శాంసన్ పేరు చేరుకోలేదని, కొన్నికొన్ని సందర్భాల్లో అర్థాంతరంగా సంజును తొలగించడం జరిగిందని వివరించారు కుంబ్లే.
‘‘సంజు శాంసన్(Sanju Samson)ను జట్టులో శాశ్వతంగా ఉంచడం గురించి చర్చలు జోరుగానే జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌పై చేసిన సెంచరీ సంజు ఆత్మవిశ్వానికి చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. శాంసన్ ఏ రేంజ్‌లో ఆడగలడో అందరికీ తెలుసు. కానీ కాస్తంత నిలకడ ఉంటే అతడికి చాలా మంచింది. అది లేకపోవడమే అతడి కెరీర్‌లో ఇన్ని ఒడిదుడులకు కారణమవుతోంది. సంజు చాలా క్లాస్ ప్లేయర్. కానీ ఆటలో స్థిరత్వం మాత్రం కాస్తంత లోపించింది. సెలక్టర్లు దీనిని దృష్టిలో ఉంచుకుటారని అనుకుంటున్నాను. ఓపెనర్, తొలి మూడు స్థానాల్లో ఎక్కడ దించినా సంజు అదరగొట్టేస్తాడు.ఫాస్ట్ బౌలర్లు వచ్చారంటే కాస్తంత టైం తీసుకుని ఆడతాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం వీరవిహారం చేస్తాడు. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాపై జరిగే నాలుగు టీ20ల్లో ఎలా రాణిస్తాడో చూడాలి’’ అని కుంబ్లే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.