మహేష్ అభిమానులకు ఈ శుక్రవారం పండుగే

మహేష్ అభిమానులకు ఈ శుక్రవారం పండుగే

0
94

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా పై ఇప్పటికే చాలా బజ్ పెరిగింది ఇందులో మహేష్ బాబు మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.

ఇక తాజాగా సినిమా గురించి అప్ డేట్ వచ్చింది.టీజర్, పోస్టర్స్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో అంటే ఈ నెల 22న సరిలేరు నీకెవ్వరు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో సినిమా పై అందరూ చర్చించుకుంటున్నారు, పూర్తి కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న చిత్రం కావడంతో భారీగానే బిజినెస్ జరుగుతుంది అని తెలుస్తోంది. ఈ టీజర్లో మహేష్ బాబు రెండు డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించనున్నాడట.

ఆర్మీ ఆఫీసర్ లుక్తో పాటు కర్నూలులో కామన్ మ్యాన్గా ఉన్న మహేష్కు సంబంధించిన సీన్స్తో ఈ టీజర్ను కట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మహేష్ బాబు ఈ చిత్రంలో ఎలా అలరించబోతున్నాడో, శుక్రవారం అభిమానులకు పండుగే