Revanth Reddy |‘అబద్ధాలు మానుకోవాలి’.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వార్నింగ్

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా పాల్గొన్నారు. ఇందుకోసం ఈరోజు ఉదయాన్నే మహారాష్ట్ర వెళ్లిన రేవంత్.. అక్కడ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రధాని హోదాలో ఉండి ఆయన అలా చేయడం ఆ పదవికే సిగ్గుచేటంటూ కీలక విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలుకు యోగ్యం కానీ హామీలిచ్చిందని, అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కష్టపడుతున్నారని ప్రధాని మోదీ(PM Modi) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తుందని చెప్పారు. ప్రజలకు కష్టం రాకుండా పాలన కొనసాగిస్తోందని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

- Advertisement -

ఇక్కడకు అందుకే వచ్చా

‘‘మహారాష్ట్ర(Maharashtra) బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటాం. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే హామీల అమలు ప్రక్రియ మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు రూ.18వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం’’ అని చెప్పారు రేవంత్.

అన్ని హామీలు అమలవుతాయి

‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది’’ అని వెల్లడించారు.

కుల గణన పట్టింపు కోసం కాదు

‘‘కుల గణను పంతాలు, పట్టింపుల కోసం మేము నిర్వహించడం లేదు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశాం. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చింది. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరిలించుకొని పోయారు. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’’ అని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్(Revanth Reddy) పిలుపునిచ్చారు.

అందులో మహారాష్ట్రాయే టాప్

‘‘దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు’’ అని తెలిపారు రేవంత్ రెడ్డి.

Read Also: ‘ప్రజల సందేహాలను వెంటనే తీర్చాలి’.. అధికారులు భట్టి సూచన
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...